e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిందగీ తెల్ల ఉల్లితో మరింత మేలు!

తెల్ల ఉల్లితో మరింత మేలు!

వంటకాల్లో ఉల్లిపాయలు ఓ భాగం. అయితే, ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిపాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నాయి. అందులోనూ, తెల్ల ఉల్లిలోని విటమిన్‌-సి, ఫ్లేవనాయిడ్లు, ఫైటోన్యూట్రియెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

తెల్ల ఉల్లితో మరింత మేలు!
  • పచ్చిగా కానీ, ఉడికించి కానీ తెల్ల ఉల్లిపాయలు తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేసే శక్తి ఉల్లిపాయకు ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. తెల్ల ఉల్లిపాయలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
  • తెల్ల ఉల్లిలోని క్రోమియం, సల్ఫర్‌లు రక్తంలోని చక్కెర నియంత్రణకు సాయపడతాయి. తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు.
  • తెల్ల ఉల్లిలోని సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. ఒంట్లో కణితి పెరుగుదలను నిరోధించే సుగుణాలు కూడా ఇందులో ఉన్నాయి.
  • తెల్ల ఉల్లి యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచుతుంది. ఇవి ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
  • ఇంకా అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా తెల్ల ఉల్లి సహాయ పడుతుంది.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెల్ల ఉల్లితో మరింత మేలు!

ట్రెండింగ్‌

Advertisement