గురువారం 28 జనవరి 2021
Zindagi - Nov 26, 2020 , 00:06:32

అదిరే హ్యాండ్‌బ్యాగ్‌

అదిరే హ్యాండ్‌బ్యాగ్‌

ఆర్ట్‌,ఫ్యాషన్‌లది విడదీయరాని బంధం. ఈ సూత్రాన్ని బాగా ఒంటబట్టించుకున్నారు బ్రెజిల్‌కు చెందిన కళాకారులు. తమ ఆలోచనను ఆచరణలోపెట్టి ‘వహ్వా’ అనిపిస్తున్నారు వారు.  

మగువల అలంకరణలో హ్యాండ్‌ బ్యాగ్‌ కూడా ఓ ఆభరణమే. ట్రెండ్‌కు తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్తవి వస్తూనే ఉంటాయి. వాటిలో భాగంగానే ఆర్ట్‌ని పొదువుకున్న హ్యాండ్‌బ్యాగ్‌లు ఇప్పుడు ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాయి. రకరకాల పెయింటింగ్స్‌ వేసిన ఆరు రకాల బ్యాగులని  లూయిస్‌ వెట్టయిన్‌  బ్రాండ్‌ద్వారా మార్కెట్‌లోకి తెచ్చారు బ్రెజిల్‌కి చెందిన ఆరుగురు కళాకారులు. కుంచెపట్టి కాన్వాస్‌ మీద వేసే ఆర్ట్‌ని బ్యాగుల మీద వేస్తూ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. క్లాసిక్‌ లుక్‌తో ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ బ్యాగులు మగువల మనసుల్ని దోచేస్తున్నాయి. వీటిని అక్టోబర్‌ చివర్లోనే మార్కెట్లో ఉంచారు. కేవలం 200 బ్యాగుల చొప్పున, పరిమితమైన స్టోర్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయట. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.logo