గోడలకు ఫొటోలను అలంకరించుకొనే విషయంలో కొంతమంది సంప్రదాయ విధానాలను ఎంచుకుంటే, మరికొందరు సృజనాత్మకతను ఆశ్రయిస్తారు. అక్కడితో ఆగాల్సిన పన్లేదు. బొమ్మలు, కళాఖండాలు, హస్తకళలతోనూ గ్యాలరీ వాల్‌ను ముస్తాబు చేయవచ్చు. ఆ ఇంటి యజమాని ఆసక్తిని, అభిరుచిని గ్యాలరీవాల్ వ్యక్తం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, గ్యాలరీవాల్ ఆ ఇంటి కథ! యజమాని వృత్తి విజయాలు, మూలాలు, అభిరుచులు, పిల్లలు, వాళ్ల చదువులు, ప్రయాణాలు, ఆ ఇంటి శుభకార్యాలు.. ఇలా ఒక్కో ఫొటో ఓ జ్ఞాపకాన్ని పంచుతుంది. గ్యాలరీవాల్గా ఎంచుకున్న గోడకు సాధ్యమైనంత వరకూ లేత రంగులనే ఎంచుకోవాలి. దీనివల్ల ఫొటోలు, కళాఖండాలు హైలైట్ అవుతాయి. ప్రత్యేక సందర్భాల్లో ఆత్మీయుల నుంచి అందిన అరుదైన బహుమతులు, గ్రీటింగ్కార్డ్స్ను కూడా అక్కడ అలంకరించవచ్చు. తాతముత్తాతలనాటి సామగ్రి ఏమైనా ఉంటే.. వాటికీ చోటు కల్పించవచ్చు.