మంగళవారం 27 అక్టోబర్ 2020
Zindagi - Sep 15, 2020 , 21:46:09

కుక్క, కోడి.. దొంగా, పోలీస్ ఆట

కుక్క, కోడి.. దొంగా, పోలీస్ ఆట

ఇటీవలి కాలంలో ట్విట్టర్‌లో జంతువుల రకరకాల వీడియోలు చాలా దర్శనమిస్తున్నాయి. ఏ జంతు క్లిప్ వైరల్ అయినా వాటి వేషాలు చూస్తూ నెటిజన్ల మనస్ఫూర్తిగా నవ్వుకొంటారు. కొందరైతే అదే వీడియోను మళ్లీ మళ్లీ చూస్తుంటారు. ఇలాంటి వీడియోలను చూసినప్పుడల్లా మన మనసు తేలికగా మారి అప్పటివరకు మనం ఎదుర్కొన్న తలనొప్పులను మర్చిపోతుంటాం. కోడి, కుక్కల మధ్య స్నేహం విచిత్రంగా ఉంటుంది. ఒక ఇంట్లో పెరిగేవి అయితే సయ్యాటలాడుతాయి. అదే రోడ్డుపై అయితే శత్రువుల్లా మారిపోయి పోట్లాటకు దిగుతాయి. ఓ ఇంట్లో పెరుగుతున్న కోడి, కుక్క.. దొంగాకపోలీస్ ఆట మనల్ని కట్టిపడేస్తుంది. 58 సెకన్ల పొడవైన ఈ వీడియో క్లిప్ లో కుక్కను పట్టుకోవడానికి కోడి చేసే ప్రయత్నం మనల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. మధ్య మధ్య కోడి అలసిపోతున్నా.. కుక్క మాత్రం దాన్ని మళ్ళీ ఆడటానికి ఒప్పిస్తుండటం ఈ వీడియో స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వేల సంఖ్యలో నెటిజెన్లు చూసి కోడి , కుక్క దొంగాపోలీసు ఆటపై మనుసు పారేసుకున్నారు. మీరూ వీటి దొంగాటను వీక్షించి కాస్సేపు హాయిగా నవ్వుకోండి.logo