మల్టీగ్రెయిన్ ఊతప్పం

- ఇమ్యూనిటీ ఫుడ్
కావలసిన పదార్థాలు: జొన్నలు: అర కప్పు, సజ్జలు: ఒక కప్పు, గోధుమలు: అరకప్పు, పచ్చి కొబ్బరి: అరకప్పు, టమోటా: ఒకటి, రాగులు: అరకప్పు, సోయాబీన్స్: అరకప్పు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చి మిర్చి: నాలుగు, కరివేపాకు: ఒక రెబ్బ, బీట్రూట్: ఒకటి, క్యారెట్: రెండు, కొత్తిమీర: ఒక కట్ట, నూనె: సరిపడా, ఉప్పు: తగినంత.
తయారీ విధానం: ముందుగా రాగులు, జొన్నలు, సజ్జలు, సోయాబీన్స్, గోధుమలు.. అన్నిటినీ కలిపి ఒక అరగంట నానబెట్టాలి. ఆతర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. బాగా నానిన మిశ్రమంలో కొబ్బరి తురుము, కరివేపాకు, తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి, కాస్త నూనె వేసి, వేడయ్యాక పిండిని గరిటతో ఊతప్పంలా వేసుకోవాలి. పైనుంచి సన్నగా కట్ చేసిన కూరగాయ ముక్కల్ని వేసి, మరికాస్త నూనె వేసి మూతపెట్టుకోవాలి. రెండువైపులా బాగా కాల్చుకుంటే రుచిగా ఉంటుంది.