శుక్రవారం 22 జనవరి 2021
Zindagi - Dec 01, 2020 , 01:20:50

ఊర్మిళ మటోండ్కర్‌

ఊర్మిళ మటోండ్కర్‌

  • వార్తల్లో మహిళ

బాలీవుడ్‌ భామ, రంగీలా ఫేమ్‌ ఊర్మిళ మటోండ్కర్‌ హీరోయిన్‌గానే కాదు.. రాజకీయ నాయకురాలిగా కూడా అందరికీ సుపరిచితమే. ఈ మహారాష్ట్ర మగువ త్వరలోనే శివసేనలో చేరబోతున్నట్టు ప్రచారం.  ఊర్మిళ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత ఐదు నెలలకే తనకు తగిన గుర్తింపు లేదని ఆరోపిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పింది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నది. ఊర్మిళ హఠాత్తుగా శివసేన వైపు మొగ్గు చూపడం ఆశ్చర్యకరమైన పరిణామమే. శివసేనలో తన పాత్ర ఎలా ఉండబోతున్నదో త్వరలో తెలుస్తుంది.


logo