శుక్రవారం 05 మార్చి 2021
Zindagi - Jan 22, 2021 , 00:12:22

కరోనా తర్వాత..

కరోనా తర్వాత..

సంవత్సర కాలం నుంచీ కరోనా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కోట్లమంది ఈ వైరస్‌ బారినపడ్డారు. ముందు నుంచీ.. కరోనా అనంతరం తలెత్తే శారీరక, మానసిక సమస్యల గురించీ ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించీ మాట్లాడేవారు తక్కువే. కొణిదెల వారి కోడలు ఉపాసన కామినేని కరోనా అనంతర సమస్యలపై చర్చించేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువర్‌లైఫ్‌.కో.ఇన్‌(urlife.co.in) ద్వారా నిపుణుల సూచనలు ఇప్పిస్తున్నారు. గాయని కనికా కపూర్‌ ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించింది. ‘కరోనా వ్యాక్సిన్‌ పుణ్యమాని ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాం. రామ్‌ చరణ్‌కు పాజిటివ్‌ రావడంతో కరోనా అనంతరం శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుకునే అవకాశం లభించింది. మార్చి 31 వరకు రోజుకొక నిపుణుడు కరోనా అనంతర పరిస్థితులపై చర్చిస్తారు’ అంటూ కార్యక్రమ విశేషాలను పంచుకున్నారు ఉపాసన. 


VIDEOS

logo