సకినాలు.. గారెలు..చేగోడీలు..మురుకులు..అరిసెలు..సర్వపిండి..ఆవకాయ తొక్కు..పొర్సు తొక్కు.. ఈ పేర్లు వినగానే మొదట అమ్మ గుర్తుకొస్తుంది.. అమ్మచేతి కమ్మదనం గుర్తుకొస్తుంది. ఇంటికి, అమ్మకు దూరంగా ఉన్నవాళ్ల ప్రాణం చివుక్కుమంటుంది. ‘ఇంటివద్ద ఉంటే అమ్మచేతి వంటలు రుచి చూసేవాళ్లం కదా’ అనిపిస్తుంది. ‘అలాంటివాళ్ల కోసం మా ఫలహారాలు సిద్ధంగా ఉన్నాయ్’ అంటున్నాడు ‘టీ స్నాక్స్’ యజమాని రాజేంద్రప్రసాద్ రేగొండ. ఆయన స్వస్థలం జగిత్యాల. ఇంజినీరింగ్ పాసయ్యాడు. సాఫ్ట్వేర్ కొలువులు చేశాడు. అవేవీ సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో హైదరాబాద్లోని ప్రగతినగర్లో రుచుల వ్యాపారం ప్రారంభించాడు. కొత్త కొత్త ప్రయోగాలూ చేస్తున్నాడు. కరోనాను దృష్టిలో పెట్టుకుని బీట్రూట్, తులసిలాంటి రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలను జోడించి మరీ చిరుతిండ్లు తయారుచేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. తన మెనూను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాడు.
… రాజు అతికం