ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని డిజైనర్ డ్రెస్సులు వచ్చినా, చీరకట్టులోని మెరుపే వేరు! అది పట్టు కావచ్చు, కాటన్ కావచ్చు! ఆ నిండుదనం మరెందులోనూ రాదు. సంప్రదాయ చీరకట్టుకు ఆధునిక హంగులు తోడైతే ఇక చెప్పేదేముంది? మహిళల మనసు దోచే నారాయణపేట మెర్సిడైజ్డ్ కాటన్ చీరల వెరైటీ కట్టుపై ఓ లుక్కేద్దాం..
గ్రీన్, పింక్ కాంబినేషన్లో డిజైన్ చేసిన ఈ చీర ట్రెండీ లుక్‌ను ఇస్తుంది. కలర్ కాంబినేషన్‌కు సరిపోయే స్టార్ బూటా, ప్లేన్ బార్డర్‌తో ఏ రంగువారికైనా చక్కగా కనిపిస్తుంది. బ్లౌజ్ కాలర్ నెక్‌తో చీరకి నప్పేలా పొడవాటి లూజ్ చేతులతో రూపొందించారు. దీన్ని ‘ప్రిన్సెస్ ైస్టెల్’ అంటారు. ఫ్రీ లుక్‌తో కనిపించే బ్లౌజ్‌ను చీరమీదికే కాదు, జీన్స్‌పై క్రాప్ టాప్లానూ వేసుకోవచ్చు. దుపట్టాను మామూలుగా కాకుండా కాస్త వదులుగా తీసి ఓల్డ్ ైస్టెల్లో వేస్తే బాగుంటుంది.
మిక్స్డ్ బ్లాక్ అండ్ గ్రీన్ చీరకు మెరూన్ బార్డర్, గోల్డ్ లైన్స్ డిజైన్ ఇది. దీన్ని ‘నర్మద జరీ’ అంటారు. చీరకు నప్పేలా అదే కలర్స్‌తో రూపొందించిన కాలర్ నెక్ బ్లౌజ్ డిఫరెంట్ లుక్‌ని ఇస్తుంది. అంతేకాదు, గోల్డ్ కలర్‌తో కాలర్‌కు నెక్ టై డిజైన్ సరికొత్తగా ఉంటుంది. దీన్ని జీన్స్మీదా వేసుకోవచ్చు. దుపట్టాను ముందుకు వేసి పిన్ చేస్తే ఫంక్షన్లు, పార్టీల్లో ట్రెండీ లుక్‌తో అదిరిపోద్ది.
డిజైనర్
నిహారిక రెడ్డి
నిహారిక డిజైన్ స్టూడియో
follow us on: (NiharikaReddyTheDesigner.facebook.
com, 8008322377