చీరకు చెల్లెలాంటి లంగావోణి అందమే వేరు. ఈడొచ్చిన అమ్మాయి లంగావోణి వేసుకుని వెళ్తుంటే కుర్రకారు గుండె జారిపోవాల్సిందే. ఒకప్పుడు పెండ్లీడుకొచ్చిన అమ్మాయిలకే సొంతమైన లంగావోణి ఇప్పుడు అన్ని వయసుల మహిళలనూ ఆకట్టుకుంటున్నది. పదహారణాల తెలుగందం పరవళ్లు తొక్కే లంగావోణి డిజైన్లేంటో చూద్దాం..
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 7013639335
అల్లుకున్న లతలు
సిల్వర్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్మీద లతలు అల్లుకున్నట్లు బాటమ్ మీద గ్రీన్, ఆరెంజ్ పెయింట్‌తో హైలెట్ చేశారు. ఆరెంజ్ కలర్‌తో డబుల్ లైన్ బోర్డర్ థిక్లైన్ బాటమ్‌కి స్పెషల్ లుక్ ఇస్తున్నది. గ్రీన్‌కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ డిజైన్ చేశారు. ప్లెయిన్ ఫ్యాబ్రిక్మీద చేసిన బుట్టా వర్క్‌తోపాటు డబుల్ లేయర్లో డిజైన్ చేసిన మెగాస్లీవ్స్తో బ్లౌజ్ హైలెట్ అయ్యింది. కాంట్రాస్ట్ కలర్స్ అయిన గ్రీన్, ఆరెంజ్‌తో ఇచ్చిన జార్జెట్ దుపట్టా సిల్వర్ బోర్డర్‌తో చక్కగా నప్పింది.
చెక్స్‌తో కొత్తగా..
చెక్స్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఫ్యాషనే. ఈ గళ్ల డిజైన్ అమ్మమ్మలు, నానమ్మల కాలం నుంచీ ఉన్నదే. దాన్నే ట్రెండీగా ఈ తరానికి నప్పేలా డిజైన్ చేసిందే ఈ చెక్స్ ైస్టెల్. పింక్ కలర్ బేస్‌తో రంగురంగుల చెక్స్, బుట్టా ఉన్న సిల్క్ పట్టును కంచిపట్టు బార్డర్‌తో హైలెట్ చేశారు. బాటమ్‌కి నప్పేలా సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ రూపొందించారు. బ్లౌజ్ మెడచుట్టూ మగ్గం వర్క్ చేశారు. బాటమ్ బార్డర్‌కి జతగా బ్లౌజ్ చేతులని పింక్ కలర్ కంచిపట్టు బోర్డర్ హైలెట్‌గా నిలుస్తున్నది. ఈ రెండిటికీ సూటయ్యేలా జత చేసిన లేత ఆకుపచ్చ వోణీ బోర్డర్‌ను మగ్గం వర్క్‌తో అందంగా తీర్చిదిద్దారు. నిండైన వర్క్‌తో డిజైన్ చేసిన పింక్ బెల్ట్ అదనపు ఆకర్షణ.