సంప్రదాయం అంటేనే సౌందర్యం. కట్టూ బొట్టులోనే కాదు, చేతులకు అలంకరించుకొనే గాజులకూ ఓ ప్రత్యేకత ఉంది. వాటికి మరింత అందాన్నిచ్చే కలీరా డిజైన్లను ఆధునిక యువతులు బాగా ఇష్టపడుతున్నారు. ఈ పంజాబీ పెండ్లి అలంకరణ ఉత్తరాదినుంచి దక్షిణాదికి విస్తరించింది. గొడుగు, బుట్ట ఆకారాల్లో పొడవుగా తయారు చేసిన కలీరాలను బంగారం లేదా వెండి గాజులకు తగిలిస్తారు. ముత్యాలు, పూలు, పూసలు, దారపు కుచ్చులు చేర్చి మరింత అందంగా రూపొందిస్తారు. సహజత్వాన్ని ఇష్టపడేవారు గవ్వలు, రంగురాళ్లతో చేసిన కలీరాలను ఎంచుకొంటున్నారు. వధువు అందాన్ని కలీరాలు రెట్టింపు
చేస్తున్నాయి.