విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేట విలద్దస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే॥
దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహాప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీదేవతా శక్తులు, తేజస్సులు మూర్తీభవించిన తేజోరూపం. సకల శత్రు సంహారిణి. సర్వ దుఃఖాలను నశింపజేస్తుంది. ఉగ్రరూపంతో దుష్టులను ఏవిధంగా సంహరిస్తుందో, అదే సమయంలో పరమశాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. ఈ తల్లిని ధ్యానిస్తే సర్వరోగాలు నశిస్తాయి. ఈ రోజు చామంతి, పొగడ, సంపెంగ, మల్లెపూలతో అమ్మను అర్చించాలి. దానిమ్మపండు సమర్పించాలి. పొంగలి, పులిహోర, పులగం నివేదించాలి.