గురువారం 13 ఆగస్టు 2020
Zindagi - Aug 01, 2020 , 16:53:15

ఇలా పెంచితే మొక్క‌లు బాగా పెరుగుతాయి!

ఇలా పెంచితే మొక్క‌లు బాగా పెరుగుతాయి!

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే మొక్క‌లు పెంచే ప‌నిలో ప‌డుతారు. ప‌చ్చ‌ద‌నాన్ని ఇష్ట‌ప‌డేవారు మొక్క‌లు పెంచుకునే ప‌నిలో బిజీగా ఉంటారు. ఎప్పుడూ మొక్క‌లు పెంచేవారికి పెద్ద‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాని కొత్త‌గా మొక్క‌లు పెంచాల‌ని అనుకునేవారికి ఈ చిట్కాలు బాగా ఉప‌యోగ‌ప‌డుతాయి. న‌గ‌రాల్లో పెద్ద‌గా ఖాళీ ప్ర‌దేశం ఉండ‌దు కాబ‌ట్టి బాల్క‌నీలో ఉన్న కొంచెం ప్ర‌దేశంలోనే పెంచుకోవ‌చ్చు. 

* వ‌ర్షాకాలంలో ఎప్పుడు వ‌ర్షం ప‌డుతుందో చెప్ప‌లేం. కాబ‌ట్టి అధికంగా వ‌ర్షం ప‌డే ప్ర‌దేశంలో మొక్క‌ల కుండీలు పెట్ట‌కూడ‌దు. ఎక్కువ సూర్య‌ర‌శ్మి, త‌క్కువ వ‌ర్షం ప‌డే ప్ర‌దేశాన్ని ఎంచుకోవాలి. 

* ఈ ప‌ద్ద‌తి ఏ కాలంలో అయినా ఒక‌టే. నేల‌మీద మొక్క‌లు నాటితే ఏ ప‌ర్వాలేదు. కుండీల్లో నాటుతాం కాబ‌ట్టి అందులో ఉన్న మట్టిని అప్పుడ‌ప్పుడు క‌దిలిస్తూ ఉండాలి. లేక‌పోతే నీరు వేర్ల‌కు చేర‌దు.  

* వాన‌పాములు మ‌ట్టికి మేలు చేస్తాయి. ఒక వాన‌పాము త‌ప్ప మ‌రి ఏ క్రిమి కీట‌కాలు ఉన్నా వాటిని తొలిగిస్తూ ఉండాలి. లేకుంటే మొక్క‌ల ఆకుల్ని తినేస్తాయి.   

* మొక్క‌ల‌కు నీరు ఎంత అవ‌స‌ర‌మో ఎక్కువైనా అంత ప్ర‌మాదం. నీరు ఎక్కువైనా మొక్క‌లు చ‌నిపోతాయి. వ‌ర్షాకాలం క‌న్నా ఎండాకాలంలో మొక్క‌ల‌కు నీరు ఎక్కువ అవ‌స‌రం అవుతుంది. మొక్క‌లు వాడిపోయిన‌ట్లు క‌నిపిస్తే వెంట‌నే నీరు పోయ‌డం మంచిది. 

* తీగ‌లు అల్లుకునే మొక్క‌ల‌కు మందుగానే పందిరి వేసుకోవాలి. తీగ‌లు అల్లుకున్న త‌ర్వాత వాటిని స‌ర్దాలంటే చాలా క‌ష్టం. ఈ తీగ‌లు చాలా డెలికేట్‌గా ఉంటాయి. వాన‌కి త‌ట్టుకొని తీగ‌లు నిల‌బ‌డాలంటే తీగ‌ల‌తో గాని లేదంటే తాళ్ల‌తో క‌ట్టాలి. 

 

తాజావార్తలు


logo