ఆ నలుగురూ.. ఆడవాళ్లే!

ఇంట్లో సొంత మనుషులు చనిపోయినా.. ఆడవాళ్లను శ్మశానానికి రానివ్వని ఆచారాలున్నాయి మన దేశంలో. కనీసం పాడెను కూడా తాకనివ్వరు. ఇలాంటి కట్టుబాట్లు మన దగ్గ్గరే కాదు, పొరుగు దేశం నేపాల్‌లో కూడా ఉన్నాయి. అయినా తరాలుగా వస్తున్న అడ్డుగోడలను కూలగొట్టి కొవిడ్‌తో మరణించిన వారి మృతదేహాలను దవాఖానాల నుంచి మరుభూమికి మోస్తున్నారు నేపాల్ సైనికురాళ్లు. పీపీయీ కిట్లు ధరించి, ప్రాణాలకు తెగించి కరోనా వారియర్స్‌గా నిలుస్తున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండులోని పశుపతి శ్మశానవాటికలో నలుగురు మహిళా సైనికులు కరోనా మృతదేహాలను మోస్తూ స్ఫూర్తిదాయకమైన సేవలు అందిస్తున్నారు.
‘ఇప్పటి వరకూ పురుషులు మాత్రమే చేస్తున్న ఈ పనిని మేము చేయడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. మొదట్లో ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. అయినా ధైర్యంగా వచ్చాను. నా స్నేహితులు నన్ను సపోర్ట్ చేశారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ.. బాధ్యత నిర్వర్తిస్తున్నా’ అంటున్నారు 25 ఏండ్ల కార్పోరల్ రచన. ఆమెతోపాటు మరో ముగ్గురు కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. నవంబర్‌లో వీళ్లు బాధ్యతల్ని చేపట్టారు. మహిళా సాధికారతను పెంచే దిశగానే మొత్తం 95వేల మంది సైనికురాళ్లకు ఈ కొత్త బాధ్యతలను ఇవ్వనున్నట్లు నేపాల్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ‘కొవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాలను అయిన వాళ్లే ముట్టుకోవడానికి భయపడుతున్న సమయంలో మాకు ఆ బాధ్యతను కేటాయించడం గర్వంగా ఉంది. ఈ పని శారీరక శ్రమతో కూడుకున్నదే. అయినా మేము వెనకాడం’ అని చెబుతున్నది మరో సైనికురాలు కృష్ణకుమారి. ఆ మహిళలకు వందనాలు.
తాజావార్తలు
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ జాప్యం'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు