ఈ హ్యాండ్‌బ్యాగ్ చాలా కాస్ట్లీ!

మామూలుగా హ్యాండ్‌బ్యాగ్ కోసం రూ.300 నుంచి మహా అయితే రూ.1000 వరకు ఖర్చు చేయడం పెద్ద విషయమేం కాదు. సెలబ్రిటీలైతే లక్షల ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌లు వాడుతుంటారు. అయితే, ఇటలీకి చెందిన బోరిని మిలానేసి అనే లగ్జరీ లెదర్ కంపెనీ తయారు చేసిన హ్యాండ్‌బ్యాగ్ ధర వింటే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే! ఈ చిన్న హ్యాండ్‌బ్యాగ్ ధర అక్షరాలా 52 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న చేతి సంచి ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీనిని మొసలి చర్మంతో చేశారట. పైగా తెల్లబంగారంతో చేసిన సీతకోక చిలుకలను బ్యాగ్‌పై పొందికగా అమర్చారు. వజ్రాలు, నీలాలు పొదిగారు. అందుకే దీని ధర రూ.52 కోట్లు పలుకుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి బ్యాగులు కేవలం మూడు మాత్రమే ఉన్నాయట. కాగా, ఈ ఖరీదైన హ్యాండ్‌బ్యాగుల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును సముద్ర కాలుష్య నివారణకు వినియోగిస్తారట. బాగుంది కదూ బ్యాగు ఆలోచన!!
తాజావార్తలు
- ఇండియన్ ఎంబసీపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి!
- గోపిచంద్ సీటీమార్ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్
- లీటర్ నీళ్లు..కాస్త బ్లీచింగ్ తో వెలుగులు
- ఎన్టీపీసీ మూడో విడుత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల
- కిసాన్ ర్యాలీ హింస.. దీప్ సిద్దూపై కేసు నమోదు!
- ఇంగ్లండ్‌లో టీమిండియాతో ఇండియా 'ఎ' ఢీ
- మొక్కల పెంపకమే.. భవిష్యత్ తరాలకు తరగని ఆస్తి
- ముంబైని యూటీ చేయండి..
- మద్యం మత్తులో ‘కోయిలమ్మ’ సీరియల్ నటుడు వీరంగం
- 20 మంది రైతు సంఘాల ప్రతినిధులకు నోటీసులు