సింగారాల ఉంగరాలు!

జీవితం మూడు రింగుల చుట్టూ తిరుగుతుంది. మొదటిది.. ఎంగేజ్మెంట్ రింగ్, రెండోది.. మ్యారేజ్ రింగ్, మూడోది.. సఫరింగ్! ఆమాటకొస్తే, సఫరింగ్ను కూడా రింగుతో గెలిచే ప్రయత్నం చేస్తారు చాలామంది. జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ రత్నం పొదిగిన ఉంగరం, ఎవరు ధరిస్తే మంచిదో నిపుణులు నిర్ణయిస్తారు. ఇక, ఫ్యాషన్ కోణంలో నుంచి చూస్తే.. ఎన్ని నగలున్నా, సింగారాల్లో ఉంగరానిదే వైభోగమంతా!
ఉంగరాలతో ముడిపడిన అనగనగా కథలు అనేకం. రాజుగారు ఓ పేదింటి పిల్లను ప్రేమిస్తారు. వెళ్తూవెళ్తూ తన రాజముద్రిక ఇచ్చి వెళ్తారు. కానీ, ఆమె నదికి వెళ్లినప్పుడు ఆ ఉంగరం నీళ్లలో పడిపోతుంది.దాన్నో చేప మింగుతుంది. దీంతో ఆ యువతికి రాజభవనంలో ప్రవేశం లభించదు. ఇలా అంగుళీక సాహిత్యంలో అనేకానేక ట్విస్టులు. నేటి ఐడెంటిటీ కార్డుల్లా.. అప్పట్లో రాజముద్రలున్న ఉంగరాల్ని వాడేవారు.
పెద్దపెద్ద పువ్వులు, జంతువుల ఆకృతిని పోలిన ఉంగరాలను ధరించడం ఇప్పుడో ఫ్యాషన్. వేలి నిండుగా చైన్లతో చేసిన ఉంగరాలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఒంటిమీది మిగతా ఆభరణాలకు మ్యాచ్ అయ్యేలా కూడా ఉంగరాలను ధరించవచ్చు. సంప్రదాయమైన ఆహార్యానికి సంప్రదాయమైన ఉంగరాలే బావుంటాయి.
బంగారం, వెండి, ప్లాటినం, పంచలోహాలు, వజ్రాలు, కెంపులు, పచ్చలు, ముత్యాలు.. అన్నీ ఉంగరాలకుసొగసులద్దేవే. నిన్న మొన్నటి వరకూ బంగారు ఉంగరాలదే హవా! ఆదాయాలు పెరగడంతో యువత ఖరీదైన ప్లాటినం వైపు మొగ్గుచూపుతున్నది.
ప్రేమ కానుకల్లో మొదటి స్థానం ఉంగరాలదే. పుట్టిన రోజులు, పెండ్లి రోజులు వంటి ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా ఇచ్చేందుకు చాలామంది ఉంగరాలనే ఎంచుకుంటారు. ఎందుకంటే హారాలు, గాజులు, గొలుసులకంటే ధర తక్కువ. అవతలి వ్యక్తికి నచ్చే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువ.
క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వధూవరులు పెండ్లిలో ఉంగరాలను మార్చుకుంటారు . చేయీ చేయీ కలుపుకొని, వేలూవేలూ ముడేసుకుని వందేండ్లు ప్రయాణించాలన్నదే అంగుళీక సందేశం.
భారతీయ సంప్రదాయం ప్రకారం, ఒకప్పుడు నిశ్చితార్థం అంటే తాంబూలాలు మాత్రమే ఇచ్చిపుచ్చుకునేవారు. ఇప్పుడు, ఉంగరాల మార్పిడి ఉండాల్సిందే. దీంతో, వధూవరుల కోసం ఒకే డిజైన్‌తో జోడు ఉంగరాలు వస్తున్నాయి.
పేర్లలోని ప్రధాన అక్షరాలు, ప్రేమ చిహ్నాలు, దేవతా రూపాలు, గణిత డిజైన్లు.. ఏవైనా సరే, ఉంగరాల్లో ఇట్టే ఇమిడిపోతాయి. ఆ ఇద్దరికి మాత్రమే తెలిసిన రహస్య సంకేతాలతో డిజైన్ చేసిన ఉంగరాలు తాజా తాజా ట్రెండ్! అటువైపు చూడగానే, మూడో వ్యక్తికి తెలియని భాషలో తామిద్దరూ చేసుకున్న బాసలేవో ఠక్కున గుర్తుకొస్తాయి.
పెండ్లయిందనడానికి మెట్టెలే సంకేతం. కాఫీడే తరానికి మాత్రం.. రింగ్ అనేది, ‘ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నా. నా కోసం ప్రయత్నించి సమయం వృథా చేసుకోవద్దు డ్యూడ్' అని హెచ్చరించే ‘నో వేకెన్సీ’ బోర్డు కూడా!
తాజావార్తలు
- తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులకు హత్రాస్ యువతి విజ్ఞప్తి
- భారీ మెజారిటీతో ‘పల్లా’ను ఎమ్మెల్సీగా గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
- కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. రంజీ మాజీ క్రికెటర్ అరెస్ట్
- రష్మీ హాట్ అందాలకు యువత దాసోహం
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు