సోమవారం 25 మే 2020
Zindagi - Mar 30, 2020 , 13:07:14

పిల్ల‌ల కోసం.. ది మ‌మ్ కో డాట్‌

పిల్ల‌ల కోసం.. ది మ‌మ్ కో డాట్‌

మ‌హిళ‌లు గ‌ర్భ‌ధార‌ణ త‌ర్వాత పూర్తి స‌మ‌యం పిల్ల‌ల‌కే కేటాయిస్తారు. వారికి ఎలాంటి ఆహారం అందించాలి. ఎలా చూసుకోవాలి అని ఎన్నో క‌ల‌లు కంటుంటారు. ఈ విధంగా క‌ల‌లు క‌న్న వారిలో ఫ‌రా మెన్జీస్‌, శ్రేయా లాంబాలు కూడా ఉన్నారు. భార‌త‌దేశంలో ఆహార ప‌రిశ్ర‌మ‌లో లేని ఎన్నో అమూల్య‌మైన ధాన్యాలున్నాయి. వాటిని వెలికి తీసి మ‌రీ పిల్ల‌ల‌కు అందిస్తున్నారు ఈ యంగ్ మ‌మ్మీలు. ది మ‌మ్ కో డాట్‌ అనే పేరుతో విజ‌య‌వంత‌మైన వ్యాపార సంస్థ‌కు పూనుకున్నారు.  ఫైబర్, కాల్షియం, ప్రోటీన్ మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న చిరుతిండ్ల‌ను అందిస్తున్నారు. ఇది భారతదేశంలో పెద్ద విజయాన్ని సాధించింది. పిల్ల‌ల‌కు మంచి ఆహారం తినిపించాల‌ని ఆరాట‌ప‌డే త‌ల్లుల‌కు ఇది స‌రైన‌ది అంటున్నారు. చాలామంది పిల్ల‌ల బాధ్య‌త‌ల‌కోసం ఉద్యోగాలు వ‌ద‌లి ఇంటికి ప‌రిమిత‌మైన వారు కూడా ఈ సంస్థ‌లో ప‌నిచేస్తున్నారు.

సంస్థ‌కు రెగుల‌ర్ క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. క‌స్ట‌మ‌ర్ల నుంచి  ఎప్ప‌టిక‌ప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ మార్పులు చేస్తున్నారు శ్రేయా, ఫ‌రా. 2016లో శ్రియ ఢిల్లీలో ఉద్యోగం మానేసి పూర్తి స‌మ‌యం దీనికి కేటాయిస్తున్న‌ది. కార్పొరేట్ అనుభవం, హార్వర్డ్ బ్యాంకులో చేసిన ఫరా కలను కొనసాగించాలని నిర్ణయించుకున్న‌ది. అని శ్రేయా చెప్పారు. వీరికి రెగుల‌ర్ క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. వారి నుంచి  ఎప్ప‌టిక‌ప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ మార్పులు చేస్తుంటారు. ఆహార ప‌దార్థాలు పెట్టెలో పెట్టి ఇస్తున్నారు. ముంబై, పూణే మరియు బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఆన్‌లైన్ ద్వ‌రా విక్ర‌యిస్తున్నారు. దీని పూర్తి వివ‌రాలు తెలుసుకోవాలంటే https://www.mumumco.com/  ని సంప్ర‌దించండి.logo