నీవు లేని బయటి విషయాలన్నిటికంటే కూడా నీలోని ‘దైవత్వమే’ అత్యంత శక్తిమంతమైంది. అందుకే, దేనికీ భయపడకుండా నీ ‘అంతరాత్మ’ను ప్రేరేపింపజేసుకో. నిన్ను నీవు మెరుగులు దిద్దుకుంటూ సద్గుణాలను పెంచుకో. హృదయాన్ని స్వచ్ఛ పరచుకో. దుర్లక్షణాలను నిర్మూలించుకొని దైవధర్మాలను అలవర్చుకో. ఆధ్యాత్మిక ఎదుగుదలకు నిరంతర, సుస్థిర సాధన తప్పనిసరి. భౌతిక, మానసిక అడ్డంకులను, అసహాయ పరిస్థితులను అస్సలు పట్టించుకోకు.