గురువారం 25 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 18, 2021 , 01:23:09

తేనెలొలికే అందం

తేనెలొలికే అందం

అమోఘమైన రుచి, అరుదైన లక్షణాలు గల దివ్యౌషధం తేనె. సౌందర్యానికీ, ఆరోగ్యానికీ దోహదపడే సుగుణాల గని. అందుకే ఆహారంలోనూ, ఔషధాల్లోనూ తేనె వాడకం ఎక్కువ. ముఖ్యంగా చలికాలంలో తలెత్తే సమస్యలకు చక్కని పరిష్కారం ఇది. చర్మం పొడిబారడం, జుట్టు చిట్లిపోవడం వంటి శీతాకాల సమస్యలకు తేనె మంచి ఉపశమనం.

  • ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో కొద్దిగా పాలు కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలపాటు ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు, మెటిమలు తగ్గుతాయి.
  • తేనెలో కొంచెం నిమ్మరసం కలిపి బ్లాక్‌హెడ్స్‌పై రాసి పదినిమిషాల తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్‌ క్రమంగా తగ్గిపోతాయి.
  • కాలిన గాయాలపై తేనె పూయడం వల్ల మచ్చలు పడవు. పెదాలను తేనెతో మర్దన చేస్తే పొడిబారకుండా ఉంటాయి. తేనె మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మకాంతిని పెంచడమే కాకుండా, మృదువుగా మారుస్తుంది.
  • వెంట్రుకలు నిర్జీవంగా మారితే ఆలివ్‌నూనెలో తేనె కలిపి రాత్రి పడుకునేముందు వెంట్రుకలకు బాగా పట్టించాలి. మర్నాడు తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తే వెంట్రుకలు చిట్లకుండా ఉంటాయి. ఆరోగ్యవంతంగానూ ఉంటాయి.

VIDEOS

logo