e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిందగీ ఆ ఐడియా విజయ్‌దే!

ఆ ఐడియా విజయ్‌దే!

ఆ ఐడియా విజయ్‌దే!

సెలబ్రిటీ డిజైనర్‌గా టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకూ ఆయనకు మంచి పేరుంది. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా తెలుగు చిత్రసీమలో చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్నారు రామ్స్‌. ‘పచ్చీస్‌’ సినిమాతో హీరోగానూ అరంగేట్రం చేశారు. ఇటీవల, ఓటీటీ వేదికగా ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా రామ్స్‌ ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

‘పచ్చీస్‌’తో హీరోగా తొలి ప్రయత్నంలోనే అందరి ప్రశంసలూ అందుకోవడం ఏమనిపిస్తుంది?
కొత్తదనాన్ని నమ్మి మేం చేసిన ప్రయత్నానికి చక్కటి ఆదరణ వస్తుండటం సంతోషంగా ఉంది. చెడు వ్యసనాల పర్యవసానాల్ని దర్శక ద్వయం రామ్‌సాయి, శ్రీకృష్ణ సందేశాత్మకంగా ఆవిష్కరించారు.

- Advertisement -

మొదటి సినిమా అనగానే చాలామంది లవ్‌, రొమాంటిక్‌ సబ్జెక్ట్‌లు ఎంచుకుంటారు? మీరేంటి క్రైమ్‌ థ్రిల్లర్‌తో ఎంట్రీ ఇచ్చారు?
ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ఉండటం వల్ల కొత్తగా ఆలోచించడం అలవాటైంది. ఈ సినిమా విషయంలో అదే పంథాను అనుసరించా.

కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మీ జర్నీ ఎలా మొదలైంది? ఎన్ని సినిమాలకు పనిచేశారు?
నా సినీ ప్రయాణం పదిహేనేండ్ల కిందట మొదలైంది. ‘జగడం’, ‘ఇష్క్‌”, ‘రోబో’, ‘ఢమరుకం’తోపాటు పలు పెద్ద చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశా. విజయ్‌ దేవరకొండ, రానా, నాగార్జున లాంటి దక్షిణాది అగ్ర హీరోలతోపాటు ఆయుష్మాన్‌ ఖురానా, పంకజ్‌ త్రిపాఠి, ఇర్ఫాన్‌ఖాన్‌ వంటి బాలీవుడ్‌ నటులకు ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేశాను.
అగ్రహీరోలందరికి ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేశారు. ఈ సినిమా విషయంలో వారు ఏమైనా సలహాలిచ్చారా?
స్టార్‌ హీరోలతోపాటు సందీప్‌కిషన్‌, సుశాంత్‌, తరుణ్‌భాస్కర్‌ లాంటి యువనటులతో నాకు చక్కటి స్నేహముంది. ట్రైలర్‌ బాగా రావడానికి కారణం.. విజయ్‌ దేవరకొండ. తను మంచి సలహాలిచ్చారు. ఓటీటీలో సినిమా విడుదల విషయంలోనూ తోడ్పాటు అందించారు.

హీరోగా కొనసాగే ఆలోచన ఉందా?
కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కొనసాగుతూనే, హీరోగా కంటిన్యూ చేస్తాను. ‘పచ్చీస్‌’ ట్రైలర్‌, టీజర్‌ చూసి ‘అనుభవజ్ఞుడిలా నటించావని, తొలిసినిమా అంటే నమ్మశక్యంగా లేద’ని ఎంతో మంది అభినందిస్తున్నారు. ఆ మాటలు చాలా సంతృప్తినిచ్చాయి. హీరోగా ఓ సినిమాను అంగీకరించా. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ‘అఖండ’ సినిమాకు పనిచేస్తున్నా.

డిజైనింగ్‌ రంగంలో రాణించడంలో నా భార్య సహకారం ఎంతో ఉంది. తను కూడా ఫ్యాషన్‌ డిజైనరే. నా ఆలోచన చెప్పగానే ఎంతో ప్రోత్సహించింది. డిజైనింగ్‌ సంస్థ నిర్వహణ, కుటుంబ బాధ్యతల్ని తానే తీసుకొని నాపై ఎలాంటి ఒత్తిడులూ లేకుండా జాగ్రత్తపడింది.

కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌కు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కదని చెబుతుంటారు? ఆ మాటతో ఏకీభవిస్తారా?
చిత్రసీమలో ఇతర విభాగాలతో పోలిస్తే కాస్ట్యూమ్‌ డిపార్ట్‌మెంట్‌కు గుర్తింపు తక్కువే. అది కాదనలేని వాస్తవం. పేరుప్రఖ్యాతుల గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నాకు అప్పగించిన పనికి న్యాయం చేయడమే కర్తవ్యంగా భావిస్తాను.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ ఐడియా విజయ్‌దే!
ఆ ఐడియా విజయ్‌దే!
ఆ ఐడియా విజయ్‌దే!

ట్రెండింగ్‌

Advertisement