బుధవారం 03 జూన్ 2020
Zindagi - Jan 28, 2020 , 23:56:51

రగ్బీ స్వీటీ!

రగ్బీ స్వీటీ!

రగ్బీ అనగానే ‘సై’ సినిమా గుర్తొస్తుంది. ఈ ఆట మహిళలు ఆడుతారన్న సంగతి తెలిసింది కొందరికే. ఇందులోనూ మహిళల జుట్టు ఉంటుంది. భార త మహిళల జట్టు తరుపున అంతర్జాతీయ స్థాయిలో బిహార్‌ అమ్మాయి రాణిస్తున్నది. విచిత్రమేంటంటే ఆమెకు ఆ ఆటే తెలియదట.

బిహార్‌లోని నవాడా అనే గ్రామానికి చెందిన స్వీటీ కుమారి భారత మహిళల రగ్బీ జట్టు తరుఫున అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నది. ఆమెకు ఆడటం తెలియదు. కానీ బాగా పరుగెత్తగలదు. అదే ఆమె బలం. అథ్లెట్స్‌లో కెరీర్‌ ప్రారంభించి అనుకోకుండా జట్టులోకి వచ్చింది. రగ్బీ అసోసియేషన్‌కు చెందిన పంకజ్‌కుమార్‌జ్యోతిని ఒకరోజు స్వీటీ కలిసింది. 


ఆమె పరుగెత్తే వేగం చూసి జట్టులో చేరమని సలహా ఇచ్చాడు. ఎలా ఆడాలో తెలియదని చెప్పింది. బంతిని పాస్‌ చేసుకుంటూ పరుగెడితే సరిపోతుందని సలహా ఇచ్చారు. అప్పుడు ఆడేందుకు సిద్ధమైంది. రన్నింగ్‌లో దూసుకెళ్లే ఆమె ఆడే విధానాన్ని సులువుగానే నేర్చుకున్నది. అనంతరం అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్లాలంటే ఆర్థిక సమస్యలతో ఆగిపోయింది. ఆమెకు అయ్యే ఖర్చంతా పంకజ్‌ పెట్టుకున్నారు. ఎలాంటి సందేహాలు, భయం లేకుండా విజయం సాధించాలని ప్రోత్సహించాడు. ఆడేందుకు ఆర్థిక సమస్యలు ఒకెత్తయితే ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలు ఎక్కువగా ఉండేవి. 


ఆమె విజయం నేటి బాలికలకు స్ఫూర్తిగా మారింది. ఆమెలా ఎదగాలని పొరుగువారు చెబుతుంటే స్వీటీకి మరింత సంతోషం కలుగుతున్నది.  క్రీడ గురించి ఆమె తల్లిదండ్రులకు మొదట్లో తెలియదు. ఇప్పుడు తన మ్యాచ్‌లన్నీ చూస్తున్నారు.  14 జాతీయ, 7 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. బెస్ట్‌ స్కోరర్‌ టైటిల్‌ను మూడుసార్లు గెలుచుకున్నది. అంతర్జాతీయ క్రీడాకారిణిగా మారాక ఆమె జీవనశైలి మారిందంటున్నది.  వీటితోపాటు మెరుగ్గా ఉండడం చాలా అవసరం. 2020 మార్చిలో వీరి జట్టు ఆడబోతున్నది. అందులో మెరుగ్గా ఆడాలని ఆశిస్తున్నది.


logo