తెలంగాణ ఆత్మ హైదరాబాద్. నాలుగువందల పైచిలుకు సంవత్సరాల మహానగరం ఎన్నో చారిత్రక కట్టడాలకు, కళాత్మక చేనేతలకు నిలయం. ఈ రెండూ తనను ఎంతగానో కట్టిపడేశాయని చెబుతారు ముంబైకి చెందిన స్టైలిస్ట్, కళాకారిణి అశ్విని నారాయణ్. భర్త ఉద్యోగ రీత్యా ఆమె హైదరాబాద్‌లో ఐదేండ్లు ఉన్నారు. ఇటీవల మరో ఊరికి మారబోతున్న సమయంలో హైదరాబాద్ తనకెంతగా నచ్చిందో ప్రపంచానికి చాటారు.
నిజానికి ఆమె ఈ ఐదేండ్లలో తెలంగాణ చేనేతలతో, చీరకట్టుతో ప్రేమలో పడ్డారు. అందుకే రకరకాల చేనేత చీరలతో సింగారించుకుని చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్, సర్దార్ మహల్, దర్బార్‌హాల్… ఇలా రకరకాల చారిత్రక ప్రదేశాల్లో ఫొటోలు దిగారు. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మై భీ హైదరాబాదీ’ హ్యాష్ టాగ్‌తో పోస్ట్ చేశారు. సిద్దిపేట గొల్లభామ చీరలు, కలంకారీ దుస్తులు తనకెంతో నచ్చాయనీ, తెలుగు అక్షరాల డిజైన్‌తో నేసిన తొలి ఇక్కత్ చీరను తానే ధరించానని సగర్వంగా ప్రకటించారు. ఎక్కడ పుడితేనేం, ఈ గడ్డ మీద కాలుపెట్టగానే.. తాను పూర్తి హైదరాబాదీ అమ్మాయిగా మారిపోయానని అంటారు అశ్విని. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్‌కు మంచి స్పందన లభిస్తున్నది.
Bala latha | సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి అండగా మారిన బాలలత స్టోరీ ఇదీ..”
ప్రకృతి వైద్యానికి సంబంధించి ఈ లైబ్రరీలో దొరకని బుక్ ఉండదు!!”
ఇవి గెలిచినోళ్ల సక్సెస్ స్టోరీస్ కాదు.. ఒక్క తప్పుతో బొక్కబోర్లా పడ్డ వ్యాపారుల కథలు!!”
వీళ్లు వంట చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే !!”
“R Meera | ఆ తెగ నుంచి నేవీ ఆఫీసర్ అయిన తొలి మహిళ ఈమెనే !!”