కల్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం
పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతా స్వాదినీం
సంపూర్ణాం పరమోత్తమాం అమృతకళాం విద్యావతీం భారతీం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం॥
స్వప్రకాశ జ్యోతి స్వరూపంతో, పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుని, సకల లోకాలకు ఆరాధ్యదేవతగా పూజలందుకునే అమ్మ అవతారం శ్రీరాజరాజేశ్వరీదేవి. మహాత్రిపురసుందరిగా ఈమె శ్రీచక్ర నివాసినియై ఉంటుంది. నిశ్చల చిత్తంతో తనను ఆరాధించిన వారికి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను వరంగా అనుగ్రహిస్తుంది. మాయా మోహితమైన మానవ మనోచైతన్యం ఈ తల్లి ఉపాసన ద్వారా ఉద్దీపనం అవుతుంది. అపరాజితాదేవిగా కూడా ఈ తల్లి పూజలు అందుకుంటుంది. పసుపు పచ్చని పూలతో అమ్మను అర్చించాలి. సువాసినీ పూజ చేసి, భక్ష్య భోజ్యాలు, లడ్డూలు నివేదన చేయాలి.