ఆకుకూరలంటేనే కొందరు పెదవి విరుస్తారు. అందులోనూ బచ్చలికూరంటే ముఖచిత్రాలే మారిపోతాయి. అయితే, బచ్చలిలో ఎన్నో పోషకాలున్నాయని చెబుతున్నారు ఆహార నిపుణులు. బచ్చలి కూరలో 'విటమిన్-సి’ అధికం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సాయపడుతుంది.ఈ ఆకుకూరలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ అపారం.బచ్చలి కూరలోని ‘విటమిన్-ఎ’ కంటి ఆరోగ్యాన్నిస్తుంది. దృష్టి దోషాలు ఉన్నవారు తప్పనిసరిగా బచ్చలికూర తినాల్సిందే. దీనిలోని లూటిన్ కంటిచూపునకు దోహదపడే రెటీనాను మెరుగు పరుస్తుంది.ఈ ఆకుకూరలోని ‘విటమిన్-కె’ ఒంటికి గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. తద్వారా రక్తస్రావాన్ని ఆపుతుంది.ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది.