HomeZindagiSocietys Pressure To Be The Perfect Mom
ఒత్తిడిలో..ఒంటరి తల్లి!
ఒంటరి తల్లులు ఎన్నో రకాల ఒత్తిళ్లను, సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. భవిష్యత్ భయం, సామాజిక, ఆర్థిక విషయాల్లో ఆందోళనలు వారిలో పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మానసిక ఒత్తిడిని దూరం చేసుకొనేందుకు కొన్ని చిట్కాలు.
సమస్యలకు చెక్ పెట్టాలంటే డబ్బు సంపాదిస్తే సరిపోదు. సంపాదనకు తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డు వాడకాన్ని తగ్గించి నగదు ఉపయోగించాలి. వీలైనంత మేర ఖర్చులు తగ్గించుకోవాలి. అదనపు ఆదాయ వనరులపై దృష్టి సారించాలి.
ఎలాంటి నిర్ణయాలైనా సొంతంగా తీసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది. కాబట్టి, ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవద్దు.
సింగిల్ మదర్‌గా ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా సవాళ్లను సొంతంగా ఎదుర్కోవాల్సిందే. బంధుమిత్రులు ఇప్పటికి సహాయం చేస్తున్నా, కొన్ని రోజులయ్యాక ఎవరూ తోడు ఉండకపోవచ్చు. అప్పుడు మళ్లీ ఒంటరితనంతో బాధ పడేకంటే ముందునుంచే స్వతంత్రంగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి.
కొంతమంది తల్లులు ప్రతి విషయంలోనూ అవతలి వాళ్లతో పోల్చుకుంటూ ఉంటారు. అన్ని విషయాల్లో పరిపూర్ణత ఉండాలని అనుకుంటారు. దానివల్ల నిరాశ, బాధ ఎదురవుతాయి. కాబట్టి, మంచి తల్లిగా ఉండాలి తప్ప, పర్ఫెక్ట్ మదర్ అనిపించుకోవడం ఎవరికైనా కష్టమే.