చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రీములు, పౌడర్లు సరిపోవు. చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించుకోవడం ముఖ్యం. చర్మ రంధ్రాలను కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ ప్రయత్నంలో గ్రీన్ టీ, టమాట ఎంతగానో సాయపడుతాయి. తాజా అధ్యయనం ప్రకారం.. టమాటలోని యాంటీ ఆక్సిడెంట్ చర్మానికి తేమను అందిస్తూ ఆరోగ్యంగా ఉంచుతుంది. మరోవైపు గ్రీన్‌టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇవి చర్మ రంధ్రాలను శుభ్రం చేసి మొటిమలను, జిడ్డుతనాన్ని తగ్గిస్తాయి. ఒక టీ స్పూన్ గ్రీన్‌టీ పొడి, ఒక టేబుల్ స్పూన్ టమాట గుజ్జు మిశ్రమంతో ముఖంపై మర్దన చేస్తూ ప్యాక్‌లా వేసుకోవాలి. పది నిమిషాలయ్యాక చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.