e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home జిందగీ సివంగి..శివాని!

సివంగి..శివాని!

సివంగి..శివాని!

టీనేజ్‌ అమ్మాయి అంటే ‘మగపిల్లాడి అరుపులకే భయపడుతుందని’ అనుకుంటారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన శివానీ సిసోడియా అలా కాదు. 18 ఏండ్లకే తనలాంటి టీనేజర్లకు ఆత్మరక్షణలో శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న శివానీ ఇప్పటివరకు 1500 మందికి ఆత్మరక్షణ పాఠాలు నేర్పింది. శివాని పదో తరగతిలో ఉండగా, ఒకరోజు స్నేహితురాలితో కలిసి వెళ్తున్నప్పుడు కొందరు ఆకతాయిలు చుట్టుముట్టారు. మాటలతో అల్లరి చేయడం మొదలుపెట్టారు. శివాని ‘ఎవరైనా వచ్చి కాపాడండి’ అంటూ కేకలు వేసింది. దాంతో ఆ కుర్రాళ్లు అక్కడ్నించి పారిపోయారు. ఆడపిల్లలకు ఆపద వస్తే ఎవరి కోసమో ఎదురు చూడకుండా తనంతట తానే ఎదుర్కొనే శక్తి అవసరమని ఆ సంఘటనద్వారా తెలుసుకుంది. శివాని తండ్రి యోగా గురువు. తల్లి స్కూల్‌ టీచర్‌. వాళ్లిద్దరూ శివాని సెల్ఫ్‌ డిఫెన్స్‌ క్లాసులకు వెళ్తానన్నప్పుడు ఎంతగానో ప్రోత్సహించారు. మొదట తాను మానసికంగా దృఢంగా మారి, ఆ పైన శారీరకంగా బలంగా తయారైంది. తర్వాత తన ఇద్దరు చెల్లెళ్లకు ఇంట్లోనే ఆత్మరక్షణ టెక్నిక్స్‌ నేర్పించడం మొదలుపెట్టింది. క్రమంగా ‘సెల్ఫ్‌ డిఫెన్స్‌ ట్రెయినర్‌’గా ఎదిగింది. భవిష్యత్‌లోకూడా తాను వీలైనంతమంది అమ్మాయిలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌లో శిక్షణ ఇస్తానని అంటున్నదామె.

Advertisement
సివంగి..శివాని!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement