ఎప్పుడూ రాజకీయ నాయకులకేనా? ఈసారి అభిమాన టీవీ తారలకూ ఓట్లు వేయండి. ఈ గ్లామరస్ ఎలక్షన్స్‌కు జీ తెలుగు ఎన్నికల కమిషన్‌గా వ్యవహరిస్తున్నది. అభిమానులంతా ఓటర్లే. తమ చానల్లో ప్రసారమయ్యే వివిధ సీరియళ్లలో నటిస్తున్న నటీ నటులను ఒక కుటుంబంగా భావిస్తూ ‘జీ కుటుంబం’ పేరుతో ఏటా అవార్డులు అందిస్తున్నది జీ తెలుగు. తాజాగా ‘జీ కుటుంబం అవార్డ్స్- 2021’ కోసం నామినేషన్లను ప్రకటించింది. పాపులర్ వ్యూయర్స్ చాయిస్ నుంచి స్పెషల్ జ్యూరీ అవార్డుల వరకు ఎన్నో కేటగిరీలు. అభిమానులు, ప్రేక్షకులు తమకు నచ్చిన స్టార్స్‌కు ఓటేసి గెలిపించవచ్చు.
ఈ ఓటింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 15 నుంచి 30 వరకూ కొనసాగుతుందని జీ టీవీ ప్రతినిధులు తెలిపారు. జీయాప్లో, వెబ్సైట్లో లాగిన్ అయి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 57575 నెంబర్‌కు ఎస్సెమ్మెస్ కూడా చేయవచ్చు. జీ తెలుగు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేసినా ఓటు చెల్లుబాటు అవుతుంది.