‘కొవిడ్ మూడో వేవ్ వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఆ తీవ్రత పిల్లలమీద ఎలా ఉంటుంది?’ అన్న ప్రశ్నలు కన్నవారిని భయపెడుతున్నాయి. కాలానుగుణంగా మార్పు చెందడమే కొవిడ్-19 వైరస్ ప్రధాన లక్షణం. దీన్నే ‘మ్యుటేషన్’ అంటారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇలాంటి మార్పులతోపాటు ప్రజల ప్రవర్తనపైనా మూడో వేవ్ తీవ్రత ఆధారపడి ఉంటుంది. నివారణ చర్యలను గాలికి వదిలేసి, బలాదూర్‌గా బయట తిరిగితే మాత్రం పరిస్థితి క్లిష్టంగా మారక తప్పదు.
డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు