గౌను, పరికిణి, వెస్ట్రన్‌వేర్.. పిల్లలకు ఏ డ్రస్ వేసినా అందంగా ఉంటారు. బర్త్ డే పార్టీలాంటి వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చిన్నారులే. ప్రత్యేక సందర్భాల్లో పిల్లలు బుట్టబొమ్మల్లా కనిపించేలా రఫుల్స్ జతగా రూపొందించిన స్పెషల్ ఫ్రాక్స్ డిజైన్లేమిటో చూద్దాం..
నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌పై ముత్యాలు, రాళ్ళు
పొదిగిన డిజైనర్ ఫ్రాక్ ఇది. ఈ ఫ్రాక్ అడుగున మల్టీ పెస్టల్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్‌తో ఏడు లేయర్లలో రఫుల్స్ జతచేశారు. పైభాగాన గోల్డెన్ బ్రీడ్స్తో చేసిన మగ్గం వర్క్, అడుగున రఫుల్స్ ఇవ్వడంతో హైలైట్ అయ్యింది. షార్ట్ ఫ్రాక్‌కు స్లీవ్‌లెస్‌గా వదిలేశారు. టాప్కు, బాటమ్‌కు కాంట్రాస్ట్ ఉండేలా రఫుల్స్కోసం వాడిన రంగుల ఫ్యాబ్రిక్‌తో రైట్సైడ్లో ఇచ్చిన ఫ్లవర్స్ అదనపు ఆకర్షణ.
పిల్లలకు ఇష్టమైన పింక్ కలర్ డిజైనర్ ఫ్రాక్ ఇది. ఫుల్లెన్త్లో లేయర్లుగా వైట్, పింక్, రెడ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో రఫుల్స్ జతచేశారు. బాటమ్‌కు కాంట్రాస్ట్‌గా పైభాగంలో ప్యూర్ వైట్ ఫ్యాబ్రిక్‌పై పింక్, డార్క్ పింక్, గోల్డ్ కలర్స్‌తో మగ్గం వర్క్ చేసి, రౌండ్‌నెక్ ఇచ్చారు. అడుగు భాగాన ఇచ్చిన లేయర్లకు నప్పేలా మూడు రంగుల్లో రఫుల్స్‌తో నెట్టెడ్ హ్యాండ్స్ జతచేశారు. పార్టీల్లో పిల్లలకు
వేసేందుకు చక్కగా ఉంటుంది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 70136 39335