సోమవారం 08 మార్చి 2021
Zindagi - Jan 24, 2021 , 00:28:06

‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’ ప్రారంభం

‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’ ప్రారంభం

లక్ష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇషాన్‌ సూర్య దర్శకుడు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్‌ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. వేదిక దత్తు కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్‌నిచ్చారు. ‘సరికొత్త అంశాలతో సాగే వినూత్న కథాంశమిది. శనివారం నుంచి హైదరాబాద్‌, అరకు ప్రాంతాల్లో ఏకధాటిగా జరిపే రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తిచేస్తాం’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కన్నా పి.సి, ఎడిటర్‌: అనుగోజు రేణుకబాబు, సంగీతం : సాయికార్తీక్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: భరత్‌ వెనిగళ్ల, దర్శకత్వం: ఇషాన్‌సూర్య.

VIDEOS

logo