తొలకరి వానలో తడిసి ముద్దవ్వాలని ఎవరికి మాత్రం ఉండదు. సమయం దొరికితే సినీతారలు అయినా, చిటపట చినుకుల్లో చిందులేయాల్సిందే! ప్రకృతి ప్రేమికురాలైన తమన్నాకు కూడా వర్షమంటే ఇష్టం. అవకాశాన్ని సృష్టించుకొని మరీ చిటపట చినుకుల్లో చిందులేస్తుంది. తన ఇన్స్టాలో తరచూ వర్షం పోస్టులు, ఫొటోలు పెడుతూనే ఉంటుంది. తాజాగా, తను వర్షంలో తడుస్తున్న ఓ వీడియోను అభిమానులతో పంచుకొన్నది తమన్నా. నగ్నపాదాలతో, పచ్చిగడ్డిపై వయ్యారంగా అడుగులేసింది కూడా. అంతేనా, ఆడిపాడి కేరింతలు కొట్టింది. ‘ప్రకృతిలో గడపడం, సీతాకోక చిలుకలను వెంబడించడం.. ఇవన్నీ అతి సహజమైన ఆనందాలు. కావాల్సినంత ఎనర్జీని ఇస్తాయి’ అని పోస్టులో పేర్కొంది తమన్నా.