గురువారం 02 జూలై 2020
Zindagi - Jul 01, 2020 , 00:08:03

‘స్వర’లోక విహారి

‘స్వర’లోక విహారి

పీవీ నరసింహారావు కేవలం రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడే కాదు. కళాసాహితీ మూర్తి కూడా. పద్యాలు, పాటలు పాడితే వినసొంపుగా ఉండేవి. త్యాగరాజకృతులు, జావళీలు అంటే చాలా ఆయనకు చాలా ఇష్టం.  మీరాబాయి భజనలు, గజల్స్‌ అంటే చెవికోసుకునేవారు. శాస్త్రీయ సంగీతంలోని రాగ, తాళ గతులను గుర్తించగల నేర్పరి. శాస్త్రీయ సంగీతపు రికార్డులంటే ఆయనకు మక్కువ. ద్వారం వెంకటస్వామినాయుడు వయోలిన్‌, పన్నాలాల్‌ ఘోష్‌ వీణలను, రోషనారా బేగం, హీరాబాయి, రవూఫ్‌ గాత్రం, అహ్మద్‌ జాన్‌ తబలా వంటి వాద్య గాత్ర సంగీతాలకు కూని రాగాల శృతి కలిపేవారు. ఎన్నికల ప్రచారంలో విరామం దొరికినా కూనిరాగాలను తీసేవారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఇందిరాగాంధీ ఆయన్ను తొలగించినప్పుడు ఢిల్లీలోని జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో చేరారు. అక్కడ స్పానిష్‌ భాషతో పాటు పియానో నేర్చుకున్నారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయాక సాయంత్రం సమయాల్లో పియానో వాయిస్తూ కాలక్షేపం చేసేవారు.


logo