మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Zindagi - Sep 16, 2020 , 00:15:21

ఆర్థికవేత్త సుబ్రహ్మణ్య స్వామికి పెద్దపీట

ఆర్థికవేత్త సుబ్రహ్మణ్య స్వామికి పెద్దపీట

ప్రతిభ ఎక్కడున్నా పీవీ ప్రోత్సహించేవారు. మనపార్టీ వారా, బయటివారా అనే భేదాలు ఆయన పాటించేవారు కాదు. అలా పీవీ ఆదరించినవారిలో ఆర్థికవేత్త సుబ్రహ్మణ్యస్వామి ఒకరు. ఆయన కాంగ్రెస్‌వాది కాదు. పైగా కరడుగట్టిన కాంగ్రెస్‌ వ్యతిరేకి. కానీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో దిట్ట. అ లాంటి వ్యక్తి సేవలు ఉపయోగించుకోవాలని పీవీ నిర్ణయించుకున్నారు. కార్మిక ప్రమాణాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై ఏర్పాటు చేసిన కమిషన్‌కు స్వామిని చైర్మన్‌గా నియమించి క్యాబినెట్‌ హోదా కల్పించారు. అంతటి ఔదార్య మూర్తి పీవీ. ఇప్పుడు పీవీకి భారతరత్న ఇవ్వాలని గట్టిగా వాదిస్తున్నవారిలో స్వామి ఒకరు కావడంలో ఆశ్చర్యం ఏముంది? 

పీవీ ఎంపికపై ప‘వార్‌'


ఏకాభిప్రాయ సాధన తర్వాత పీవీ ప్రధాని పదవి చేపట్టినా కొందరు సీనియర్లు మాత్రం గుర్రుగానే ఉన్నారు. అలాంటివాళ్లలో మరాఠా నేత శరద్‌పవార్‌ ముఖ్యులు. పీవీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టవద్దని గట్టిగా భావించిన శరద్‌ పవార్‌ తెరవెనుక చాలా తతంగం నడిపారు. అప్పటికే ఇటు భారతాన్ని, అటు ప్రపంచాన్ని ఔపోసన పట్టిన పీవీ మేధావిత్వం, సచ్ఛీలత ముందు ఆయన చేసిన కుట్రలన్నీ వీగిపోయాయి. కేంద్రమంత్రి పదవితో పవార్‌ సరిపెట్టుకున్నా తన అభ్యర్థిత్వాన్ని కాకుండా పీవీని సమర్థించినవారిపై ఆయన పగలు ప్రతీకారాలు పెంచుకున్నారు. పీవీని గట్టిగా సమర్థించిన వారిలో సునిల్‌దత్‌ ముఖ్యులు. తర్వాతి కాలంలో దత్‌కు పవార్‌ రకరకాల సమస్యలు సృష్టించి చుక్కలు చూపారు. పీవీ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముం దుకుపోయారు.  


logo