కావలసిన పదార్థాలు
క్యారెట్, క్యాప్సికమ్, మష్రూమ్, ఉల్లిగడ్డ: ఒక్కొక్కటి, క్యాబేజీ తురుము: పావు కప్పు, మైదా: రెండు కప్పులు, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లికాడలు (తరిగినవి): రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ముందుగా కూరగాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తరిగిన కూరగాయలు, పచ్చిమిర్చి, మైదా, ఉప్పు, ఉల్లికాడలు వేసి తగినన్ని నీళ్లుపోసి బాగా కలిపి పది నిమిషాలపాటు పక్కన పెట్టాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేసి, వేడయ్యాక మిశ్రమాన్ని కాస్త మందంగా వేసి రెండువైపులా నూనెవేస్తూ సన్నని మంటపై దోరగా కాల్చుకుంటే వెజిటబుల్ పాన్ కేక్ రెడీ.