కావలసిన పదార్థాలు
ఉలవలు: రెండు టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి: ఆరు, మినుప పప్పు: ఒక టీస్పూను, ఆవాలు: అర టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు: 2, చింతపండు: నిమ్మకాయంత, కరివేపాకు: రెండు రెబ్బలు, పచ్చికొబ్బరి తురుము: ఒక కప్పు, ఉప్పు: తగినంత
తయారీ విధానం
ఉలవల్ని దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి వేడయ్యాక ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, మినుప పప్పు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో పచ్చికొబ్బరి తురుము, ఉలవలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, చింతపండు, కరివేపాకు వేసి కొద్దికొద్దిగా నీళ్ళు చిలకరిస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. వేడివేడి అన్నంతో ఈ ఉలవల చట్నీ చాలా రుచిగా ఉంటుంది.