కావలసిన పదార్థాలు
చికెన్ (బోన్‌లెస్): 250 గ్రా; కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, గుడ్డు: ఒకటి, తెల్ల నువ్వులు: ఒక టేబుల్ స్పూన్, నువ్వుల నూనె: ఒక టేబుల్ స్పూన్, తేనె: రెండు టేబుల్ స్పూన్లు, టమాట సాస్: ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్: ఒక టీస్పూన్, రెడ్‌చిల్లీ సాస్: రెండు టీస్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్: ఒక టీస్పూన్, గరం మసాల: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, నిమ్మరసం: ఒక టీస్పూన్, నూనె: సరిపడా.
తయారీ విధానం: చికెన్‌ను చిన్నచిన్న ముక్కలుగా కోసి గుడ్డు, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, రెడ్‌చిల్లీ సాస్, గరం మసాల వేసి బాగా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు, స్టవ్‌మీద కడాయి పెట్టి నువ్వులు వేసి ఒక నిమిషంపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి, వేడయ్యాక చికెన్ ముక్కలను విడివిడిగా వేసుకుంటూ సన్నని మంటపై గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. స్టవ్‌మీద మరోపాన్ పెట్టుకుని నిమ్మరసం, సోయా సాస్, తేనె, టమాట సాస్ వేసి సన్నని మంటపై రెండు నిమిషాలు మరిగించి తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలపాలి. ఒక టీస్పూన్ కార్న్‌ఫ్లోర్‌ను రెండు టేబుల్స్పూన్ల నీళ్లలో ఉండలు లేకుండా కలిపి సాస్ మిశ్రమంలో వేసి మరిగించాలి. సాస్ దగ్గర పడ్డాక, వేయించిన చికెన్ ముక్కల్ని వేసి బాగా కలిపి పైనుంచి నువ్వులు చల్లుకుంటే నోరూరించే నువ్వుల చికెన్ సిద్ధం.