కావలసిన పదార్థాలు
ఓట్స్: ఒక కప్పు, శెనగపిండి: అరకప్పు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), క్యారెట్ తురుము: పావుకప్పు, క్యాప్సికమ్: ఒకటి, కారం: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, అల్లం: అంగుళం ముక్క,
జీలకర్ర: అర టీస్పూన్, వాము: పావు టీస్పూన్, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా.
తయారీ విధానం
ఓట్స్ను బాగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. మిక్సీజార్లో నానిన ఓట్స్, శెనగపిండి, సగం ఉల్లిపాయ ముక్కలు, కారం, తరిగిన అల్లం, ఇంగువ, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. దోశల పిండిలా జారుగా రుబ్బుకున్న మిశ్రమంలో క్యారెట్ తురుము, సన్నగా తరిగిన క్యాప్సికం, ఉల్లిగడ్డ, జీలకర్ర, వాము వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి ఒక టీస్పూన్ నూనెవేసి వేడయ్యాక, పిండి మిశ్రమాన్ని గరిటతో వేసుకుని పరుచుకోవాలి. పైనుంచి మరో టీ స్పూన్ నూనె వేసి సన్నని మంటపై రెండు వైపులా కాల్చుకుంటే ఓట్స్ బేసన్ చిల్లా రెడీ.