కావలసిన పదార్థాలు
బ్రకోలి: రెండు కప్పులు, శనగపిండి: ఒక కప్పు, క్యారెట్: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర: కొద్దిగా, కారం: రెండు టీస్పూన్లు, గరం మసాలా: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా.
తయారీ విధానం
ముందుగా బ్రకోలిని ఉడికించి చిన్నగా తురుముకోవాలి. ఒక గిన్నెలో బ్రకోలి తురుము, సన్నగా తరిగిన క్యారెట్, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు, స్టవ్‌మీద పాన్‌పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. బ్రకోలి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని కట్లెట్లుగా ఒత్తుకుని, సన్నని మంటపై రెండు వైపులా కాల్చుకుంటే బ్రకోలి కట్లెట్ రెడీ!