బుధవారం 03 మార్చి 2021
Zindagi - Feb 10, 2021 , 13:21:07

ఫస్ట్‌ నైట్‌ : కంప్యూటర్‌తో పెండ్లి కొడుకు కుస్తీ

ఫస్ట్‌ నైట్‌ : కంప్యూటర్‌తో పెండ్లి కొడుకు కుస్తీ

న్యూఢిల్లీ : కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన పెండ్లి కుమార్తెకు తొలి రాత్రే వింత అనుభవం ఎదురైంది. శోభనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమై వధువు కొత్త పెండ్లికొడుకు కోసం వేచిచూస్తుంటే అతగాడు కాస్తా కంప్యూటర్‌లో మునిగితేలుతున్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోపై ట్విటర్‌లో  నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటూ ఫన్నీ మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఈ ఫోటోను ‘హోల్డ్‌ ఆన్‌ బేబీ’గా నెటిజన్లు పిలుస్తూ ఒక్కొక్కరు ఒక్కో క్యాప్షన్‌ ఇస్తున్నారు.

‘బేబీ..కొద్దిసేపు ఆగు..ముందు నన్ను ట్విటర్‌ నోటిఫికేషన్స్‌ చెక్‌ చేసుకోనివ్వ’ని ఓ నెటిజన్‌ ఈ ఫోటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. నేను డ్యాన్స్‌ చేస్తున్న ఫోటోను అప్‌లోడ్‌ చేసేవరకూ ఆగు అని మరో యూజర్‌ ట్వీట్‌ చేశారు. ఇక మరో యూజర్‌ ‘హోల్డ్‌ ఆన్‌ బేబీ నా సెర్చి హిస్టరీని డిలీట్‌ చేయనివ్వ’ని మరో యూజర్‌ జోక్‌ చేశారు. ‘హోల్డ్‌ ఆన్‌ బేబీ మరో గంటలో డబుల్‌ గేమ్‌ వీక్‌ డెడ్‌లైన్‌ ముంచుకొస్తోంద’ని మరో యూజర్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఫోటోను ఎప్పుడు, ఎక్కడ తీశారనే వివరాలు వెల్లడికాలేదు.

VIDEOS

logo