e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home జిందగీ నేనేంటో తెలుసుకున్నా..

నేనేంటో తెలుసుకున్నా..

నేనేంటో తెలుసుకున్నా..

‘నేను చాలా మారిపోయాను’ అంటున్నది బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా. కరోనా వేళలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో లీడ్‌రోల్‌లో అలరించింది. ఓ విజేత కథలో కనిపించిన ఆమె ‘ప్రతీ మనిషి గెలుపు వారిచేతుల్లో,చేతల్లోనే ఉంటుంద’ని చెబుతున్నది. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌ స్టార్‌గా ఎదిగిన పరిణీతి చెప్పిన కబుర్లు ఇవి..

మనిషి తన ఆలోచనే కరెక్ట్‌ అని భావిస్తుంటాడు. సరైన అనుభవం ఎదురైతే గానీ, అభిప్రాయాన్ని మార్చుకోడు. అలాంటి అనుభూతినే ఇచ్చింది నేను నటించిన ‘ద గర్ల్‌ ఆన్‌ ద ట్రైన్‌’ చిత్రం. ఈ సినిమా నా జీవితాన్ని, దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. నా పనిలో, ఆహార్యంలో పూర్తి మార్పు తీసుకొచ్చింది.

ప్రతి మనిషి లోపల మరో వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని గుర్తించి, బయటకు తీసుకురాగలిగితే నిజమైన జీవితం అనుభవంలోకి వస్తుంది. నన్ను నేను పూర్తిగా గుర్తించగలిగాను. అప్పటినుంచి నేనేం చేయాలి, ఎలా చేయాలన్న విషయాల్లో సరైన స్పష్టత వచ్చింది. నన్ను నేను తెలుసుకునే ప్రయాణంలో ‘ద గర్ల్‌ ఆన్‌ ద ట్రైన్‌’ చిత్రం ఎంతగానో దోహదపడిందని భావిస్తున్నాను. ఎందుకో తెలీదు, ఈ సినిమా పూర్తయ్యాక కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది.

సామాజిక మాధ్యమాలు అందానికి నిర్వచనం మార్చేశాయనిపిస్తుంది. చాలామంది అందంగా కనిపించాలని ఫిల్టర్స్‌ పెట్టుకొని ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. మనం మనలా కనిపించడమే నిజమైన అందం. ఈ విషయంలో మన ముందుతరాల వాళ్లు అదృష్టవంతులు అనిపిస్తుంది. పదీ పదిహేనేండ్ల కిందట మొదలైన కొత్త మాధ్యమాలు మనిషి ఆలోచనలను ఇంతలా కలుషితం చేస్తాయని ఊహించలేదు. అందులోని మంచిని మాత్రమే స్వీకరించి, చెడుకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

సామాజిక మాధ్యమాలు అందానికి నిర్వచనం మార్చేశాయనిపిస్తుంది. చాలామంది అందంగా కనిపించాలని ఫిల్టర్స్‌ పెట్టుకొని ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. మనం మనలా కనిపించడమే నిజమైన అందం. ఈ విషయంలో మన ముందుతరాల వాళ్లు అదృష్టవంతులు అనిపిస్తుంది. పదీ పదిహేనేండ్ల కిందట మొదలైన కొత్త మాధ్యమాలు మనిషి ఆలోచనలను ఇంతలా కలుషితం చేస్తాయని ఊహించలేదు. అందులోని మంచిని మాత్రమే స్వీకరించి, చెడుకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

అందం కనిపించే రూపంలో ఉండదని గట్టిగా నమ్ముతాను. మేకప్‌ మందంగా వేసుకున్నంత మాత్రాన అందంగా కనిపిస్తామనుకుంటే పొరపాటే! మానసికంగా ఆనందంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తాం. మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు ఆ ప్రభావం బ్యూటీనెస్‌పైనా పడుతుంది. ‘అంతఃసౌందర్యమే నిజమైన అందం’ అని విశ్వసిస్తాను.

నేను సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఏమీ అర్థమయ్యేది కాదు. ఇక్కడ నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డాను. నటన పరంగా రోజురోజుకూ పరిణతి చెందుతూ వచ్చాను. చేస్తున్న పనిలో పూర్తి స్థాయిలో ఇన్‌వాల్వ్‌ అయ్యేదాన్ని. ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్‌ పెట్టడం, నిజాయతీగా కష్టపడటం వల్లే నా జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నది. ఎంత ప్రణాళికాబద్ధంగా నడిచినా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని సరిగ్గా అడ్రస్‌ చేయగలగాలి. సరైన దారిలో నడవకపోతే విలువైన సమయం వృథా అవుతుంది. గడిచిన మూడేండ్లలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. తొందరగానే అందులోనుంచి బయటపడ్డాను.

సొంతంగా ఆలోచించడం, స్వీయ నిర్ణయాలు తీసుకోవడంలో చాలామంది విఫలమవుతూ ఉంటారు. ఒకప్పుడు నేనూ అంతే. వేసుకునే దుస్తుల నుంచి పెట్టుకునే నగలు, తీసుకునే నిర్ణయాల వరకు చాలా విషయాల్లో ఇతరుల ప్రభావానికి గురయ్యేదాన్ని. మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేనప్పుడు ఇలాంటి కన్‌ఫ్యూజన్‌ ఏర్పడుతుంది. ఇతరులను అనుకరించడం సరికాదు. మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. అవతలి వ్యక్తిలోని మంచిని స్వీకరించడం మంచిదే! కానీ, ప్రతిసారీ అదే పాటిస్తానంటే సరికాదు.

Advertisement
నేనేంటో తెలుసుకున్నా..
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement