గురువారం 04 జూన్ 2020
Zindagi - Jan 30, 2020 , 23:10:49

పాతవే.. కొంచెం కొత్తగా!

పాతవే.. కొంచెం కొత్తగా!

మహిళలకు ఇంటి అలంకరణపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. కానీ కొందరు ఏది ఎక్కడ పెట్టాలో తెలియక సతమతమవుతుంటారు. ముఖ్యంగా టేబుల్స్‌, సూట్‌కేస్‌లు పాతగా అయ్యాయని పక్కన పడేస్తుంటారు. కానీ, కొద్దిగా క్రియేటివిటీ జోడిస్తే వాటినీ కొత్తవాటిలా మార్చుకోవచ్చు. ఇంటి అలంకరణలో ఆ వస్తువుల్నీ వాడొచ్చు.

  • చాలామంది ఇండ్లల్లో వుడెన్‌ చైర్స్‌ ఉంటాయి. వీటిని కొన్ని రోజులు వాడి పాతబడ్డాయని స్టోర్‌ రూమ్‌లో పడేస్తుంటారు. వాటిని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో ఆ గోడలకు ఉన్న రంగును పాత ఫర్నీచర్‌కు వేస్తే అందంగా కనిపిస్తాయి. 
  • సూట్‌కేస్‌లు ఒకప్పుడు బాగా ఫేమస్‌. ఇప్పుడు వాటి వాడకం చాలావరకు తగ్గింది. ఇదివరకే కొని వృథాగ పక్కన పడేసిన వారు వీటిని తిరిగి వాడొచ్చు. పడక గదిలో సూట్‌కేస్‌ను పెట్టుకోవచ్చు. వాటిలో పుస్తకాలు, పెన్నులు, కళ్లద్దాలు, చిన్న చిన్న వస్తువుల్ని పెట్టుకోవచ్చు. లేదంటే డైరీలు, ఖాతాపుస్తకాలు, చిల్లర డబ్బులు దాచుకునేందుకు కూడా సూట్‌కేస్‌లు ఉపయోగపడుతాయి.
  • పాత కర్టెన్లు చూసీ చూసీ బోర్‌ కొడుతున్నదా? కర్టెన్ల చివర అంచులకు రకరకాల  బొమ్మలు అతికించాలి. లేదంటే పాత కర్టెన్లకు  డిజైన్‌ వేసినా కొత్తగా కనిపిస్తాయి.
  • కొన్ని రోజులు వాడగానే దిండ్లు పలుచగా అయిపోతుంటాయి. వాటిని పడేస్తుంటారు. వీటికి మంచి కుషన్స్‌ తొడగాలి. వాటిపై ల్యాప్‌టాప్‌ పెట్టి వాడుకోవచ్చు. ఒళ్లో ల్యాప్‌టాప్‌ పెట్టుకుంటే అనర్థాలు వచ్చే కారణంగా పాత దిండ్లను ఇలా కూడా వాడుకోవచ్చు.


logo