కావలసిన పదార్థాలు:
ఓట్స్: రెండు టేబుల్ స్పూన్లు, పాలు: అరకప్పు, గుడ్లు: రెండు, ఉప్పు, మిరియాలపొడి: తగినంత, నూనె: కొద్దిగా, ఉల్లిపాయ, టమాట, మిర్చి ముక్కలు: పావుకప్పు
తయారీ విధానం:
ముందుగా ఓట్స్ను పాలలో నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత మెత్తగా మెదుపుకుని దాంట్లో కోడిగుడ్లు, ఉప్పు, ఉల్లిపాయ, టమాట, మిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. పెనం వేడయ్యాక, నూనె వేసి ఆమ్లెట్ వేసుకుని రెండువైపులా బాగా కాల్చుకుని మిరియాలపొడి చల్లుకుంటే సరి. ఆరోగ్యకరమైన ఓట్స్ ఆమ్లెట్ రెడీ.