e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిందగీ లీడర్‌ అంటే..

లీడర్‌ అంటే..

లీడర్‌ అంటే..

ఆటలో కోహ్లీ దూకుడును కొందరు మెచ్చుకున్నారు. అంతదూకుడు పనికిరాదన్న వారూ ఉన్నారు. ఆటతీరులో దూకుడుగా ఉండే కోహ్లీ మిగతా విషయాల్లో పట్టువిడుపులు ప్రదర్శిస్తుంటాడు. జట్టుకు నాయకత్వం చేపట్టిన తర్వాత సందర్భోచితంగా వ్యవహరిస్తున్నాడు. టీమ్‌ లీడర్‌ పాత్రను సమర్థంగా పోషిస్తున్న కింగ్‌ కోహ్లీ దృష్టిలో అసలైన లీడర్‌ ఎలా ఉండాలో ఇలా చెప్పుకొచ్చాడు…

  • నాయకత్వం అంటే ఏదో పదవి కాదు. దాన్ని మన జీవనశైలిలో భాగంగా మలుచుకోవాలి. ప్రతి ఒక్కరిలో సందర్భాన్ని బట్టి తనలోని నాయకత్వ లక్షణాలు బయటకు వస్తుంటాయి. ఆ తర్వాత మళ్లీ నొక్కి పెట్టేస్తుంటారు. కానీ, మనలో నిద్రాణంగా ఉన్న నాయకుడ్ని తట్టిలేపాలి. అలాగని నాయకత్వం నియంతృత్వానికి దారితీయొద్దు. దాన్నొక బాధ్యతగా స్వీకరించి పద్ధతిగా పాటించాలి.
  • అందరిలోనూ రకరకాల స్కిల్స్‌ ఉంటాయి. వారు ఎంచుకున్న రంగంలో చక్కటి ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. దశాబ్దాలుగా క్రికెట్‌ ఆడుతున్న వాళ్లకు ఆటపై ఆ మాత్రం పట్టు ఉండటం సహజం. అలాగే ఇతర వ్యక్తులకు వారు ఎంచుకున్న రంగాలపై పట్టు ఉంటుంది. కానీ, స్కిల్స్‌తోపాటు ఉన్నతమైన విలువలు ఉన్నవాళ్లే గెలుపు తీరాలను చేరుకోగలరు. ప్రతిభతోపాటు వ్యక్తిత్వమూ ప్రధానం.
  • గెలుపు ఓటములు ఎందులోనైనా సహజం. విజయాల్లో ఉన్నప్పుడు మన చుట్టూ పదిమంది చేరుతారు. గెలుపును ఆస్వాదించడమూ తేలికే! పరాజయం అలాకాదు. చాలా కఠినంగా ఉంటుంది. ఓటమిలో ఉన్నప్పుడు పలుకరించేవారు ఉండరు. దాన్ని జీర్ణించుకోవడమూ కష్టమే! కానీ, గెలుపు కన్నా ఓటమి జీవితాన్ని ఎక్కువగా తీర్చిదిద్దుతుందని నేను నమ్ముతాను. ప్రతి పరాజయం ఒక విలువైన పాఠాన్ని చెబుతుంది.
  • మానసికంగా దృఢంగా ఉండాలంటే ముందుగా శారీరకంగా బలంగా తయారవ్వాలి. క్రీడల్లో ఉన్నవారికే కాదు, ఎవరికైనా శారీరక ఆరోగ్యం ప్రధానం. అప్పుడే దేన్నైనా సాధించగలనన్న ఆత్మవిశ్వాసం వస్తుంది. శారీరక శ్రమను తట్టుకునే సామర్థ్యమూ పెరుగుతుంది.
  • సంపాదన ప్రధాన వ్యాపకంగా ఉండొద్దు. డబ్బుకోసం చేసే పనులు సక్సెస్‌ను ఇస్తాయేమో గానీ, పూర్తిస్థాయి సంతృప్తిని మాత్రం ఇవ్వవు. మనం విజయాలు సాధిస్తూ పోతుంటే దానివెంట డబ్బూ వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నిజాయితీగా ఉండటం ముఖ్యం. మనం సంపాదించే ప్రతి పైసా సంతోషాన్నివ్వాలి గానీ, మన వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చేదిలా ఉండకూడదు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లీడర్‌ అంటే..

ట్రెండింగ్‌

Advertisement