మంగళవారం 11 ఆగస్టు 2020
Zindagi - Jul 02, 2020 , 23:40:36

కాకెత్తుకెళ్లిన కలలు!

కాకెత్తుకెళ్లిన కలలు!

కొత్త కొలువులపై కొవిడ్‌ ఎఫెక్ట్‌ ఎక్కువే. 66శాతం మంది తాజా గ్రాడ్యుయేట్స్‌ చేతిలో ఉద్యోగం లేకుండా ఉన్నట్టు నౌకరీ.కామ్‌ సర్వేలో వెల్లడైంది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు సాధించినవారిలోనూ  44శాతం మందికి జాయినింగ్‌ తేదీలు ఇవ్వలేదు. తొమ్మిది శాతం మందికి ఇచ్చిన ఆఫర్‌ లెటర్లను కూడా వెనక్కి తీసుకున్నారట. ఈ ఏడాది దాదాపు 82 శాతం కళాశాలల ప్లేస్‌మెంట్స్‌పై కొవిడ్‌ దెబ్బ ఎక్కువే. 74శాతం మంది ప్రీ ఫైనల్‌ విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌పై కూడా ప్రభావం ఉంటున్నది. ఖాళీగా ఉండటం ఎందుకని.. 70 శాతం మంది పట్టభద్రులు ఇప్పటికే వివిధ ఆన్‌లైన్‌ కోర్సులలో  నమోదు చేసుకున్నట్టు కూడా నౌకరీ.కామ్‌ సర్వే చెబుతున్నది.  logo