సోమవారం 01 మార్చి 2021
Zindagi - Jan 29, 2021 , 02:28:12

‘నమ్మ చాయ్‌' అదుర్స్‌

‘నమ్మ చాయ్‌' అదుర్స్‌

ఉదయం లేవగానే వేడివేడి చాయ్‌ నోట్లో పడకపోతే, చాలామందికి ఆ రోజు తెల్లారదు. ముఖ్యంగా మన దేశంలో చాయ్‌ పియులకు కొదవే లేదు. వాతావరణంతో సంబంధం లేకుండా చాయ్‌కి ఎప్పటికీ ఫుల్‌ గిరాకీ ఉంటుంది. కొందరు కాఫీ షాపులకు వెళ్తే, ఇంకొందరు చాయ్‌ డబ్బాకు వెళ్తారు. ప్లేస్‌ ఏదైనా  రుచి ఒక్కటేనంటారు చాయ్‌ పియులు. ఆ కస్టమర్లను ఆకట్టుకోవడానికే స్విట్జర్లాండ్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసి, చాయ్‌ బిజినెస్‌లోకి దిగింది చెన్నైకి చెందిన దమయంతి.సెలూన్‌ బిజినెస్‌లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వీణ, కుమారవేల్‌ దంపతుల కూతురు దమయంతి. నిజానికి ఫుడ్‌ బిజినెస్‌ చేయాలని ఆమె తండ్రికి చాలాకాలంగా ఉండేదట. అది తెలుసుకున్న దమయంతి చదువు పూర్తవగానే చెన్నైకి వచ్చి ‘నమ్మ కేఫ్‌'ను ప్రారంభించింది. “పరిశుభ్రత, నాణ్యత, వైవిధ్యం  నమ్మ కేఫ్‌ ప్రత్యేకతలు. ప్రస్తుతం మా కంపెనీకి చెన్నై, కోయంబత్తూర్‌, సేలం, ఈరోడ్‌, కూనూర్‌, వెల్లూర్‌ వంటి నగరాల్లో మొత్తం 20 అవుట్‌లెట్లు ఉన్నాయి. రాబోయే రెండేండ్లలో తమిళనాడు వ్యాప్తంగా 1000 అవుట్‌లెట్లను ప్రారంభించాలన్నది నా ఆశయం” అంటున్నది దమయంతి. నమ్మ కేఫ్‌ మాత్రమే కాకుండా ఆమె, తమ ఫ్యామిలీ బిజినెస్‌లు అయిన పేజ్‌3 సెలూన్స్‌, ది లగ్జరీ బ్రాండ్‌ ఆఫ్‌ నేచురల్స్‌లనూ చూసుకుంటున్నది. VIDEOS

logo