e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home ఆరోగ్యం వానకాలం.. పోషకాల గొడుగు

వానకాలం.. పోషకాల గొడుగు

వానకాలం.. పోషకాల గొడుగు

వానకాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కూరగాయలు ఈ కాలంలో ఎక్కువగా తినాలని చెబుతారు న్యూట్రిషనిస్టులు.

కాకరకాయ: కాకరకాయవల్ల గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ సమస్యలకు కారణమయ్యే మైక్రోబ్స్‌ (సూక్ష్మక్రిములు) దరిచేరవు. కాకర జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

- Advertisement -

సొరకాయ: ఇందులో పాస్ఫరస్‌, మెగ్నీషియం, పొటాషియం పుష్కలం. కొవ్వు శాతం తక్కువ. సొరకాయ గుజ్జు కూర కడుపులో మంటను తగ్గిస్తుంది.

కీరదోస: ఇందులోని హెపటోప్రొటెక్టివ్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కాలేయ సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే జ్వరం, సర్దితో వచ్చే నీరసాన్ని తగ్గిస్తాయి.

పుట్ట గొడుగులు (బటన్‌ మష్రూమ్స్‌): వీటిని బాగా కడిగి వండుకుని తినొచ్చు. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. పైగా యాంటీ బ్యాక్టీరియల్‌, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి.

ముల్లంగి: రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడే పాలీఫెనాల్స్‌, ఐసోథియోసైనేట్స్‌ ముల్లంగిలో ఉంటాయి. శ్వాస సంబంధ వ్యాధులనుకూడా ఇవి తగ్గిస్తాయి.

బీరకాయ: ఇది రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని మలినాలను బయటికి పంపుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బీరకాయలో కెరోటీన్‌, అమైనో యాసిడ్స్‌, ప్రొటీన్స్‌ ఉంటాయి. వీటివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.

కందగడ్డ: వానకాలపు గ్యాస్ట్రో సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని ఫెనోలిక్‌ కాంపౌండ్స్‌, ఫ్లెవనాయిడ్స్‌, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా కాపాడుతాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వానకాలం.. పోషకాల గొడుగు
వానకాలం.. పోషకాల గొడుగు
వానకాలం.. పోషకాల గొడుగు

ట్రెండింగ్‌

Advertisement