‘తాడు చేతికి కడితే కాశీతాడు.. నడుముకు కడితే మొలతాడు.. ఇక్కడ కడితే పడతాడు’ ఈ సినిమా డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఈ సూత్రం ప్రతిచోటా అన్వయం కాకపోవచ్చు కానీ, ఫ్యాషన్ ప్రపంచానికి మాత్రం చక్కగా నప్పుతుంది. ముక్కుపుడకను చెవిపోగుగా పెట్టుకోవచ్చు. మెడలో లాకెట్‌ను పాపిట బిళ్లగా ధరించొచ్చు. ఇదే ఫార్ములాతో మల్టీపర్పస్ ‘బందానాలు’ వచ్చేశాయి. తలకు పాగాగా, చేతిలో రుమాలుగా, మెడకు కంకణంగా, ముఖానికి స్కార్ఫ్‌లా, చుడీదార్పైకి పొట్టి దుపట్టాలా ఇమిడిపోతున్నాయివి. స్కార్ఫ్కున్న క్రేజ్ క్రమంగా మసకబారింది. కొవిడ్ కారణంగా ఇండ్ల నుంచి బయటకు రావడం తగ్గడంతో స్కార్ఫ్ వినియోగమూ తగ్గిపోయింది. పైగా బయటకు వచ్చినా మాస్క్ తప్పనిసరి కావడంతో.. స్కార్ఫ్ధారణకు ముఖం చాటేస్తున్నారు యువతులు. ఈ నేపథ్యంలో మల్టీపర్పస్ బందానాలు మార్కెట్లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నాయి. ఒకే వస్త్రం పలురకాలుగా ఉపయోగపడుతుండటంతో ఆన్లైన్ అంగట్లో వీటి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. మల్టీపర్పస్లు నెరవేరుస్తున్న బందానా కమ్ స్కార్ఫ్‌లను మల్టీకలర్స్లో కొనుగోలు చేస్తూ.. సందర్భోచితంగా ధరిస్తున్నారు
యువతులు.