గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 30, 2020 , 22:59:30

మిషన్‌ 2020

 మిషన్‌ 2020

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ప్రేరణతో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మిషన్‌ 2020’. నవీన్‌ చంద్ర, నాగబాబు ప్రధాన పాత్రధారులు. కరణం బాబ్జీ దర్శకుడు. కుంట్లూర్‌ వెంకటేష్‌గౌడ్‌, రమేష్‌రాజు నిర్మాతలు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సమకాలీన రాజకీయ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవల శ్రీ  రాపాకపై చిత్రీకరించిన ఐటెంసాంగ్‌తో  షూటింగ్‌ పూర్తయింది. నా కెరీర్‌లో విభిన్నమైన సినిమాగా నిలుస్తుంది’ అని తెలిపారు. 2020  సినిమా ఇండస్ట్రీకి పెద్ద సంక్షోభాన్ని మిగిల్చిందని,  దానిని ‘మిషన్‌ 2020’ ఛేదిస్తుందనే నమ్మకముందని శ్రీకాంత్‌ చెప్పారు. చక్కటి సందేశంతో తెరకెక్కిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని నిర్మాతలు పేర్కొన్నారు. 


logo