గురువారం 04 మార్చి 2021
Zindagi - Jan 25, 2020 , 23:03:34

ఔషధ నిధి వెల్లుల్లి

ఔషధ నిధి వెల్లుల్లి

  • వెల్లుల్లిని ప్రతిరోజూ వంటల్లో ఉపయోగించడం వల్ల తరచూ వచ్చే జలుబుకు ఉపశమనం కలిగించవచ్చు. అస్తమా, శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది.
  • వెల్లుల్లి ఇన్సూలిన్‌ను పెంచుతుంది. మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది.
  • వారానికి 5 వెల్లుల్లిపాయలు పచ్చివి తినడం వల్ల క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండొచ్చు.
  • ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలో యాంటీ బయాటిక్‌ గుణాలు ఎక్కువ. అజీర్ణం, హైబీపీలను తగ్గించే గుణాలుంటాయి.
  • వెల్లుల్లిలో థయామిన్‌ లోపాన్ని తగ్గించి అభివృద్ధి చేసే గుణం కూడా పుష్కలం. ఇందులో విటమిన్‌ సి కూడా ఉంటుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. 

VIDEOS

logo